News December 22, 2025

తిరుపతి జిల్లాలో తొలిసారి..!

image

TDP తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి నియమితులైన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు ఏ మహిళ కూడా అధ్యక్షురాలిగా ఎంపిక కాలేదు. తొలిసారి పనబాకకు ఆ అవకాశం దక్కింది. పార్లమెంట్ పరిధిలో గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు SC రిజ్వర్ నియోజకవర్గాలు. కేంద్ర మంత్రిగానూ పనిచేయడంతో SC సామాజిక వర్గానికి చెందిన ఆమెకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు.

Similar News

News December 31, 2025

కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం: ఏఐటీయూసీ

image

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ విశాఖలో గళమెత్తారు. ఈ కోడ్లు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తే కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా FEB 12న జరగనున్న అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు.

News December 31, 2025

ప్రొద్దుటూరు: న్యూ ఇయర్ వేళ.. ఆ ఇంట్లో విషాదం

image

ప్రొద్దుటూరు శివారులోని జమ్మలమడుగు రోడ్డులో టిప్పర్ ఢీకొని కమలాపురం మండలంలోని సంబటూరు గ్రామానికి చెందిన పొట్టిగారి అయ్యవారు (51) అనే వ్యక్తి మృతి చెందాడు. భార్య దేవికి తీవ్రగాయాలయ్యాయి. మైలవరంలో చదువుతున్న కుమార్తెకు కొత్త సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులు కొత్త బట్టలు ఇచ్చేందుకు వెళ్లి వస్తుండగా.. ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News December 31, 2025

JGL: నా అన్వేశ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి: BSS నాయకులు

image

దేశాన్ని, హిందూ దేవతలను కించపరిచిన నా అన్వేషణ అన్వేశ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని భారత్ సురక్ష సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం జగిత్యాలలో వారు మాట్లాడుతూ.. నా అన్వేషణ అన్వేశ్ అనే యాత్రికుడు హిందూ దేవతలైన సీతా, ద్రౌపదీ మాతలను అవమానకరంగా మాట్లాడడమే కాకుండా దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడని ఆరోపించారు. అతని పాస్‌పోర్ట్ క్యాన్సల్ చేసి, దేశానికి రప్పించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.