News December 22, 2025
మంచిర్యాల: నేడు పల్లెల్లో కొలువుదీరనున్న పాలకవర్గాలు

మంచిర్యాల జిల్లాలోని 302 గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ప్రత్యేక అధికారుల సమక్షంలో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి ఎన్నికైన వారే అధికంగా ఉండటంతో, నిధుల కొరతను అధిగమించి అభివృద్ధి చేయడం వీరికి సవాల్‌గా మారింది. ప్రమాణ స్వీకారం రోజే తొలి సమావేశం నిర్వహించి పల్లె పాలనకు శ్రీకారం చుట్టనున్నారు.
Similar News
News December 26, 2025
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం HYD నుంచి బయలుదేరి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా దివంగత మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం డోర్నకల్ మండలంలో పర్యటించి, నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్ మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
News December 26, 2025
ప్రత్యేక PGRSలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్

జిల్లా అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఎస్టీలు, దివ్యాంగుల ప్రత్యేక PGRS కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీలు, దివ్యాంగుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటికి వెంటనే కలెక్టర్ పరిష్కార మార్గం చూపినట్లు వివరించారు.
News December 26, 2025
పింఛన్ లబ్ధిదారులకు కలెక్టర్ గుడ్ న్యూస్!

నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఒకరోజు ముందుగానే నగదు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశించిన సమయానికి పింఛన్ అందజేయాలని స్పష్టం చేశారు.


