News December 22, 2025

అన్నమయ్య జిల్లాలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

image

అన్నమయ్య జిల్లా కేవీ పల్లి (M) కరణంవారి పల్లికి చెందిన రాచపల్లి నాగచైతన్య (15) మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చౌడేపల్లి జడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతూ ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్న అతడు శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. చదువుపై తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై రాత్రి ఇంటి వరండాలో ఉరి వేసుకున్నట్లు సమాచారం. గమనించి వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు.

Similar News

News January 10, 2026

కర్నూలు పోలీసుల డబ్బుల బేరం.. రంగంలోకి DGP!

image

KNLలోని ఓ PSలో పనిచేస్తున్న నలుగురు క్రైం పార్టీ సిబ్బంది అవినీతి చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ చోరీ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారిని కర్నూలుకు తీసుకొచ్చారు. అయితే మార్గమధ్యంలో శివరాంపల్లి వద్ద అతనితో బేరం కుదుర్చుకొని డబ్బులు ఫోన్ పే చేయించుకున్నారు. ఈ విషయంపై ఆ వ్యాపారి తెలంగాణ ప్రజాప్రతినిధుల ద్వారా AP DGPతో మాట్లాడించారు. చర్యలకు జిల్లా ఉన్నతాధికారులను DGP ఆదేశించినట్లు తెలుస్తోంది.

News January 10, 2026

వరంగల్: 13 మంది బాల కార్మికులకు విముక్తి

image

ఆపరేషన్ స్మైల్ 12వ విడతలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో AHTU ఆధ్వర్యంలో ఇద్దరు బాలికలతో సహా 13 మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తి కలిగించారు. ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ పరిధిలో ఐదుగురు, వెస్ట్ జోన్ పరిధిలో ఐదుగురు, ఈస్ట్ జోన్ పరిధిలో ముగ్గురు బాలలను రక్షించినట్లుగా అధికారులు వెల్లడించారు.

News January 10, 2026

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నామినేటెడ్‌పై ఆశలు

image

ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు ముమ్మరమైంది. పండుగలోపే కీలక కార్పొరేషన్లు, కమిటీల నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. DCCB, DCMS వంటి సహకార సంస్థల పాలకవర్గాల నియామకంపై స్పష్టత రావడంతో ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, కాంగ్రెస్ పట్ల విధేయత ప్రాతిపదికన తుది జాబితా సిద్ధమవుతున్నట్లు సమాచారం.