News December 22, 2025

నల్గొండ: పశువుల ఆస్పత్రిలోనే పంచాయతీ పాలన!

image

నిడమనూరు మండలంలోని పలు జీపీలకు సొంత భవనాలు లేక పాలన అద్దె గదుల్లోనే సాగుతోంది. నిడమనూరు మేజర్ పంచాయతీ భవన నిర్మాణం 11 ఏళ్లుగా అసంపూర్తిగానే ఉండటంతో, ప్రస్తుతం పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిధులు విడుదల చేసి సొంత భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News January 13, 2026

నల్గొండ: పాఠశాల నిర్మాణ పనుల తనిఖీ

image

వచ్చే విద్యా సంవత్సరం నాటికి నల్గొండ ఎస్ఎల్ బీసీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అకడమిక్ బ్లాక్, తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఎస్ఎల్‌బీసీ వద్ద ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు.

News January 13, 2026

రైతన్నకు తప్పని ‘యూరియా’ కష్టాలు

image

జిల్లాలో యాసంగి వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్న వేళ, ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ ద్వారానే యూరియా తీసుకోవాలన్న నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. కేవలం PACS, మన గ్రోమోర్ కేంద్రాల్లోనే స్టాక్ ఉండటం, ప్రైవేటు డీలర్లు అమ్మకాలు నిలిపివేయడంతో యూరియా దొరకడం గగనమైంది. పొలాలకు ఎరువులు వేయాల్సిన సమయంలో గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 13, 2026

నల్గొండ: జిల్లాలో ఆరు ‘యంగ్‌ ఇండియా’ పాఠశాలలు

image

NLG జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌ పాఠశాలల’ నిర్మాణానికి భూములను గుర్తించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. NLG, మునుగోడులో పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. వచ్చే ఏడాది కల్లా స్కూల్స్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.