News December 22, 2025

బెజవాడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరి అరెస్ట్

image

విజయవాడ మాచవరం PS పరిధిలోని ఓ హోటల్‌లో MDMA డ్రగ్స్ సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరు పట్టుబడగా, నెల్లూరుకు చెందిన మరో నిందితుడు సినిమా ఫక్కీలో కారుతో సహా పరారవ్వడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ముగ్గురు నిందితులు హోటల్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పరారైన వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు.

Similar News

News January 8, 2026

SV వేదిక్ వీసీ రిట్ పిటీషన్ డిస్మిస్

image

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి హైకోర్టులో వేసిన రిట్ పిటీషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఆయనను తొలగించాలని పాలకమండలి నిర్ణయం మేరకు టీటీడీ విచారణ చేపట్టింది. దీనిపై కోర్టు విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

News January 8, 2026

మొక్కజొన్న కంకిలో చివరి వరకూ గింజలు రావాలంటే?

image

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.

News January 8, 2026

ఇవాళ మూసుకోనున్న శ్రీవారి వైకుంఠ ద్వారం

image

AP: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో గత నెల 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు. ఇంతటితో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి కానున్నాయి. మొత్తం 10 రోజుల్లో మొదటి 3 రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. మిగతా 7 రోజుల్లో సర్వదర్శనానికి వచ్చిన భక్తులకు అవకాశం కల్పించారు. రేపటి నుంచి యథావిధిగా ప్రత్యేక దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.