News December 22, 2025
2025@ విషాదాల సంవత్సరం

2025 భారత్‌కు మర్చిపోలేని విషాదాలను మిగిల్చింది. కరూర్ (తమిళనాడు), తిరుపతి, ఢిల్లీ రైల్వే స్టేషన్, బెంగళూరు, ప్రయాగ్‌రాజ్ కుంభమేళాల్లో జరిగిన తొక్కిసలాటలు, గోవా క్లబ్ అగ్ని ప్రమాదం, SLBC సొరంగం కుప్పకూలిన ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. పహల్గాం ఉగ్రదాడి ఉలిక్కిపడేలా చేసి ఆపరేషన్ సిందూర్‌కు దారి తీసింది. జూన్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, వెంటనే వచ్చిన వరదలు వందల మంది ప్రాణాలు తీశాయి.
Similar News
News January 9, 2026
నెహ్రూ అంటే గౌరవమే.. కానీ: థరూర్

నెహ్రూ అంటే తనకు ఎంతో గౌరవమని.. కానీ ఆయన చేసిన ప్రతి పనిని తాను గుడ్డిగా సమర్థించనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. నెహ్రూ మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలంగా నాటారని ప్రశంసించారు. అయితే 1962 చైనా యుద్ధం లాంటి విషయాల్లో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో తప్పులు ఉన్నాయన్నారు. BJP ప్రతి చిన్న విషయానికి నెహ్రూను నిందించడం సరికాదని.. ఆయనను ఒక బూచిగా వాడుకుంటున్నారని విమర్శించారు.
News January 9, 2026
FY26లో జీడీపీ వృద్ధి 7.5 శాతం: SBI

దేశ GDP వృద్ధి రేటు 2025-26లో 7.5% ఉండొచ్చని SBI రిపోర్టు వెల్లడించింది. ‘NOV చివరికి ₹9.8L Cr ద్రవ్యలోటు ఉంది. ఇది బడ్జెట్ అంచనాల్లో 62.3%. FY26 బడ్జెట్ అంచనాల కంటే పన్నుల ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ పన్నేతర ఆదాయం ఎక్కువగా ఉంది. అందువల్ల మొత్తం ఆదాయంపై ప్రభావం పడకపోవచ్చు. ద్రవ్యలోటు ₹15.85L Crగా(బడ్జెట్ అంచనా ₹15.69L Cr) ఉండొచ్చు. దీన్నిబట్టి ఫిస్కల్ డెఫిసిట్ 4.4%గా ఉండొచ్చు’ అని పేర్కొంది.
News January 9, 2026
ICSILలో 50 పోస్టులకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<


