News December 22, 2025

గుంటూరులో క్రీస్తు సేవ.. ఘన చరిత్ర కలిగిన చర్చిలు

image

క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గంలో గుంటూరు చర్చిలు నడుస్తున్నాయి. AELC ఆధ్వర్యంలో విద్య, వైద్య సేవలు అందుతున్నాయి. 1842లో రెవరెండ్ హయ్యర్ స్థాపించిన సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ ప్యారిస్ చర్చికి 150ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అలాగే 1905లో వెస్ట్ ప్యారిస్ చర్చిని నిర్మించారు. నార్త్ ప్యారిస్ చర్చి 60ఏళ్లుగా సేవలందిస్తోంది. 1940లో ఏర్పాటైన గుంటూరు మేత్రాసనం ఆధ్వర్యంలో పాఠశాలలు, ఆసుపత్రులు నడుస్తున్నాయి.

Similar News

News December 26, 2025

GNT: పెదకాకాని హైవేపై ప్రమాదం.. చిధ్రమైన శరీరం

image

పెదకాకాని హైవేపై శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించగా, శరీరం నుజ్జునుజ్జై భయంకరంగా మారింది. మృతదేహం ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా మారింది. దీంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మృతదేహాన్ని గుంటూరు కొవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకాయంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు.

News December 26, 2025

ఫ్లాష్.. గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్‌ ఈయనే..!

image

సుమారు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం భర్తీ చేసింది. టీడీపీకి చెందిన కుర్రా అప్పారావును ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవికి చాలామంది ఆశావహులు పోటీపడగా, అధిష్ఠానం కుర్రా అప్పారావును నియమించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News December 26, 2025

గుంటూరు: రూ.53 లక్షల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ

image

సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన సెల్‌ఫోన్లను రికవరీ చేసి గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు సుమారు రూ.7.53 కోట్ల విలువైన 3,769 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. సెల్‌ఫోన్ల రికవరీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని SP పేర్కొన్నారు.