News April 22, 2024
పాకిస్థాన్ బియ్యంలో పురుగులు: రష్యా

పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో పురుగులు ఉన్నాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ బియ్యం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవని, ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. కాగా, బియ్యం ఎగుమతులపై గతేడాది భారత్ నిషేధం విధించడంతో పాక్ బియ్యానికి డిమాండ్ పెరిగింది. అమెరికా, బ్రిటన్, ఇతర యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
Similar News
News March 11, 2026
మోదీ పాలనలో క్యూలే మిగిలాయి: కాంగ్రెస్

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మోదీ హయాంలో దేశ ప్రజలు నిరంతరం లైన్లలోనే గడపాల్సి వస్తోందంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో 2016 నోట్ల రద్దు సమయంలో ATMల వద్ద పడ్డ కష్టాలు, కరోనా సెకండ్ వేవ్ వేళ ఆక్సిజన్ కోసం, ప్రస్తుతం వంట గ్యాస్ (LPG) కోసం క్యూ కట్టడాన్ని ఎత్తిచూపింది. మోదీ పాలనలో కేవలం క్యూలే మిగిలాయని సెటైరికల్ ట్వీట్ చేసింది.
News March 11, 2026
దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ మరోసారి దాడి చేసింది. డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఎయిర్‌పోర్టులో ఉన్న భారతీయుడు సహా నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. విమానాశ్రయం నుంచి భారీగా పొగ వెలువడుతోంది. మరోవైపు విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవల కూడా దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి చేసింది. తమపై దాడి చేస్తున్న US-ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నాయని గల్ఫ్ దేశాలపై ఇరాన్ అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే.
News March 11, 2026
వార్ ఎఫెక్ట్.. హోటళ్లు, హాస్టళ్లలో ఇదీ పరిస్థితి!

TG: హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, హాస్టళ్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. సరఫరా తగ్గడంతో ఇప్పటికే పలు హోటళ్లు మెనూను కుదించగా, కొన్ని చోట్ల ధరలు పెరిగాయి. అటు హాస్టళ్లలో దోశ, పూరీ వంటి వంటకాలను నిలిపివేసి, భోజనం మాత్రమే అందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భోజనం పెట్టలేమని, వసతి మాత్రమే కల్పిస్తామని యజమానులు హెచ్చరిస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


