News December 22, 2025
జనగామ: అంబులెన్స్‌లో వచ్చి సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం

జనగామ మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్ అంబులెన్స్‌లో వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారిణిగా ఏఈవో సౌమ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సర్పంచ్ గొల్లపల్లి అలేఖ్య అనారోగ్యంతో ఉండగా అంబులెన్స్‌లో వచ్చి మరీ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్‌గా గొల్లపల్లి పర్షయ్య ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
Similar News
News December 27, 2025
నంద్యాల: గంధం చంద్రుడుకు కార్యదర్శిగా పదోన్నతి

NDL: రాష్ట్రంలో ఐదుగురు కలెక్టర్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడుకు చెందిన కలెక్టర్ గంధం చంద్రుడుకు (2010 బ్యాచ్) కార్యదర్శిగా పదోన్నతి లభించింది. కాగా.. ప్రస్తుతం గంధం చంద్రుడు రాష్ట్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు.
News December 27, 2025
వడ్డే తులసి కుమార్‌పై జిల్లా బహిష్కరణ

చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అలవాటుపడిన వడ్డే తులసి కుమార్‌పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ కలిగిన ఇతడిపై హత్య, దోపిడీ, SC–ST కేసులు సహా పలు నేరాలు నమోదయ్యాయన్నారు. ఇప్పటివరకు ముగ్గురిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే బహిష్కరణ తప్పదన్నారు.
News December 27, 2025
భూపాలపల్లి: పోలీసుల పనితీరు అభినందనీయం: ఎస్పీ

భూపాలపల్లి జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ సంకిర్త్ అభినందించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగడం వల్లనే బాధితులకు న్యాయం చేకూరుతుందని, నేరస్తులకు శిక్షలు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఏడాదిలో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, జిల్లాను నేరరహితంగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


