News December 22, 2025
డోన్: ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్

డోన్ ఉప ఖజానా కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రిటైర్డ్ అధికారి శ్యామ్ రాజు ఫిర్యాదు మేరకు సీనియర్ అసిస్టెంట్ ఆర్.లక్ష్మణ్ నాయక్ పని పూర్తి చేసేందుకు రూ.30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లంచం తీసుకున్న సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ హెచ్చరించింది.
Similar News
News January 3, 2026
గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

కొవ్వూరు ఎరినమ్మ ఘాట్ వద్ద శనివారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పట్టణ సీఐ పీ. విశ్వం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి సుమారు 60 ఏళ్లు పైబడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుడి వద్ద ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440796622కు కాల్ చేయాలన్నారు.
News January 3, 2026
వంటింటి చిట్కాలు

* బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే పెంకులు సులువుగా వస్తాయి.
* కూరల్లో పులుపు తక్కువయితే మామిడి పొడితో పెరుగును కలిపి కూరలో వేస్తే టమాటా రుచి వస్తుంది.
* ఆలూ పరాటా చేసేటప్పుడు ఉడికించిన బంగాళదుంపలను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి, చల్లారిన తర్వాత పరోటా చేస్తే జిగటగా లేకుండా చక్కగా వస్తాయి.
* సేమ్యా హల్వా రుచిగా రావాలంటే చెంచా సెనగపిండి కలిపితే సరిపోతుంది.
News January 3, 2026
సిరిసిల్ల: నారుమడులపై చలి ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు

యాసంగి సాగుకు అధిక చలి, మంచుతో నారుమడులపై తీవ్ర ప్రభావం ఏర్పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలితో పాటు సూర్యరశ్మి లేకుండా దట్టమైన పొగ మంచు ఉండడంతో నారుమల్లు ఎదగడం లేదు. సిరిసిల్ల జిల్లాలోని అధిక గ్రామాల్లో నారుమల్లు పోసిన 25 రోజుల తర్వాత నాట్లు వేసేవారు. కానీ, 35 రోజులు దాటినా నాట్లు వేయలేని దుస్థితి నెలకొంది. నాట్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


