News December 22, 2025
కామారెడ్డిలో ప్రజావాణి

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ డా.కిరణ్మయి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, బాధితులకు రసీదులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, ట్రైనీ కలెక్టర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 3, 2026
బాయ్‌ఫ్రెండ్‌ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచి..

ముంబైలో బాయ్‌ఫ్రెండ్‌ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచి ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణంగా దాడి చేసిందో మహిళ. శాంటాక్రూజ్‌లో ఉండే మహిళ(25), బాధితుడు(42) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఎన్నిసార్లు అడిగినా అతడు నిరాకరించాడు. దీంతో న్యూఇయర్ వేడుకలని అతడిని ఇంటికి ఆహ్వానించింది. పదునైన కత్తితో మర్మాంగాలపై అటాక్ చేసింది. బాధితుడు పారిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమె పరారీలో ఉంది.
News January 3, 2026
కేయూ ఇయర్ వైస్ డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు శుభవార్త

కాకతీయ విశ్వవిద్యాలయం ఇయర్ వైస్ విద్యార్థులకు బ్యాక్ లాగ్ పరీక్షలకు అవకాశం కల్పిస్తూ విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి కట్ల రాజేందర్, అడిషనల్ కంట్రోలర్ వెంకయ్య నోటిఫికేషన్ జారీ చేశారు. బీఏ, బీఎస్సీ ,బీకాం, బీబీఎం, బీసీఏ( నాన్ ప్రొఫెషనల్) ఏడాది బ్యాక్ లాగ్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 31 లోపు ఒక్కో పేపర్‌కు రూ.4 వేల చొప్పున కళాశాలల ద్వారా వర్సిటీ పరీక్షల విభాగంలో చెల్లించాలని తెలిపారు.
News January 3, 2026
సభా సమరం.. కృష్ణా జలాలపై ఇవాళ చర్చ!

TG: కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో ఇవాళ షార్ట్ డిస్కషన్ జరగనుంది. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ 12PMకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 4 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్, పే స్ట్రక్చర్) సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానుంది.


