News December 22, 2025
ఈ ఫుడ్స్‌లో పుష్కలంగా ప్రొటీన్లు!

శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రొటీన్ ఒకటి. కండరాల పెరుగుదల, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 100గ్రాముల సోయాబీన్స్‌లో 36.5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అలాగే జనపనార గింజలు(31.6g), సన్‌ఫ్లవర్ సీడ్స్(20.8g), అవిసెలు(18.3g), పెసరపప్పు(24.0g), రాజ్మా(23.6g), కందులు(22.3g), వేరుశనగలు(25.8g), బాదం(21.2g), పన్నీర్(18.0g), పెరుగు(3.5g), పాల నుంచి 3.3 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.
Similar News
News January 12, 2026
ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేయసి సోఫీతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు చేతికి రింగ్ ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
News January 12, 2026
సివిల్ సూట్ వేసినా.. స్టాప్ ఆర్డర్ వస్తేనే ఊరట

‘నల్లమలసాగర్’పై TG పిటిషన్‌ను కాదని సివిల్ సూట్ వేయాలని SC సూచించింది. అయితే సివిల్ సూట్ వేస్తే AP సహా గోదావరి బేసిన్‌లోని ఇతర రాష్ట్రాలూ స్పందించాలి. వాటి స్పందనకు ఎంత టైం పడుతుందో తెలియదు. అటు గోదావరి నీటి తరలింపునకు ఫీజిబిలిటీ నివేదికను కేంద్రానికి అందించి DPR టెండర్లకు AP సిద్ధమైంది. ఈ తరుణంలో సివిల్ దావా వేసినా SC స్టాప్ ఆర్డర్ ఇస్తేనే TGకి ఊరట. వరదజలాలే వాడుతున్నట్లు AP వాదిస్తోంది.
News January 12, 2026
పండుగల్లో ఇలా మెరిసిపోండి

* ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది.
* పుదీనా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీని వల్ల ముఖం తాజాగా మారుతుంది.


