News December 22, 2025

తిరుమల దర్శనాలపై TTD కీలక ప్రకటన

image

తిరుమల వైకుంఠద్వార దర్శనాలకు డిసెంబర్ 30, 31, జనవరి 1న ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన వాళ్లనే అనుమతిస్తారు. ఉదయం స్లాట్ల భక్తులు కృష్ణతేజ సర్కిల్ నుంచి, మధ్యాహ్నం స్లాట్ల భక్తులు ATGH నుంచి, రాత్రి స్లాట్ల భక్తులు శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతిస్తామని TTD తెలిపింది. టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవు. టోకెన్, ఆధార్ కార్డులతో స్లాట్ సమయానికి భక్తులు రావాలని పోలీసులు కోరారు.

Similar News

News January 13, 2026

ముంబైలో నయా దందా.. 30 వేలకే భారత పౌరసత్వం?

image

ముంబైలో అక్రమ వలసదారులపై NDTV కథనం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారికి కేవలం రూ.7 వేల నుంచి రూ.30 వేలకే బర్త్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి నకిలీ పత్రాలు అందుతున్నట్లు వెల్లడించింది. 61 ప్రాంతాల్లో 3,014 మందిని పరిశీలించగా వీరిలో 96% అక్రమంగా భారత్‌లోకి వచ్చిన ముస్లింలేనని తెలిపింది. ‘మాల్వాణి ప్యాటర్న్’ పేరుతో వీరంతా ఓటు బ్యాంకులుగా మారుతున్నారని పేర్కొంది.

News January 13, 2026

మిగిలిన భోగి పళ్లను ఏం చేయాలి?

image

భోగి పళ్లు పోసిన తర్వాత కింద పడిన పళ్లను పిల్లలు ఏరుకుంటారు. ఆ తర్వాత మిగిలిపోయిన పళ్లను బయట పడేయకూడదు. వాటిని శుభ్రం గోమాతలకు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పళ్లు వృధా కాకుండా ఉండటమే కాకుండా, పశువులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మన సంప్రదాయాల్లో జీవ కారుణ్యం కూడా భాగమని చెప్పడానికి ఇదో నిదర్శనం.

News January 13, 2026

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ శ్రావణి

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కోడి పందేలు, గుళ్ల ఆటలపై నిషేధం ఉందన్నారు. వాటి జోలికి దూరంగా ఉండాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.