News December 22, 2025
జనవరిలో లాంగ్ వీకెండ్స్.. వరుస సెలవులు

2026 JANలో రెండుసార్లు లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. JAN 1 (గురువారం)తో కొత్త సంవత్సరం. శుక్రవారం (జనవరి 2) ఒక్కరోజు సెలవు పెడితే, శని, ఆదివారాలతో కలిపి వరుసగా 4 రోజులు హాలీడేస్ ఎంజాయ్ చేయవచ్చు. అలాగే JAN 24 శని, 25 ఆదివారం. సోమవారం (26) గణతంత్ర దినోత్సవం హాలిడే ఉంది. జనవరి 23 (శుక్రవారం)న వసంత పంచమి రోజు సెలవు పెడితే వరుసగా 4 రోజులు హాలీడే దొరికినట్లు అవుతుంది. అలాగే సంక్రాంతి సెలవులు ఉన్నాయి.
Similar News
News December 28, 2025
90 పైసలకే 50 ఎకరాలా: పేర్ని నాని

AP: చంద్రబాబు నోట PPP, P4 మాటలే వస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వారు వ్యాపారం మాత్రమే చేస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో భూములు దోచుకుంటున్నారని, 90 పైసలకే 50 ఎకరాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సామాన్యులు, పేదల పట్ల చంద్రబాబు దృక్పథం మారట్లేదన్నారు.
News December 28, 2025
మిరపలో ఆకు ముడత తెగులు – లక్షణాలు

మిరపసాగులో ఆకుముడత తెగులు గతంలో తామర పురుగులు, పేను, దోమ వలన వచ్చేది. నేడు వీటితో పాటు జెమినీ వైరస్, మొజాయిక్ వైరస్‌లు కూడా ఈ ముడత తెగులు పురుగుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై, లేత పసుపు రంగుకు మారతాయి. ఆకులు పైకి ముడుచుకొని, రెమ్మలు గిడసబారుతాయి. మొక్కలు బలహీనపడి, పూత, పిందె సరిగా కట్టవు. దీనివల్ల పంట పెరుగుదలకు నష్టం వాటిల్లి, దిగుబడి తగ్గుతుంది.
News December 28, 2025
భారీ జీతంతో ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

<


