News December 22, 2025
నల్గొండ: 21 ఏళ్లకే సర్పంచ్‌గా బాధ్యత

ఆ యువతి 21 ఏళ్లకే సర్పంచ్‌గా ఎన్నికై ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో 21 ఏళ్ల కుర్మేటి పుష్పలత ప్రశాంత్ సర్పంచ్‌గా ఎన్నికై ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్‌గా గుర్తింపు పొందిన ఆమె గ్రామాభివృద్ధి, పారదర్శక పాలనతోపాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు.
Similar News
News December 29, 2025
మిర్యాలగూడ : ’44 ఏళ్ల తర్వాత కలిశారు’

మిర్యాలగూడ పట్టణంలోని బకాల్ వాడ ఉన్నత పాఠశాలలో 44 వసంతాల ఆత్మీయ కలయికతో 1980-81లో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాలలో మొదలైన స్నేహం ఎంతో అపురూపమని, స్నేహ బంధం విలువ వెలకట్టలేనిదని వారిలో ఒకరైన పూర్వ విద్యార్థి రామశేఖర్ అన్నారు.
News December 29, 2025
క్వార్టర్ ఫైనల్‌కు మెదక్ జిల్లా జట్టు

మనోహరాబాద్‌లోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న పదవ తెలంగాణ అంతర్ జిల్లాల సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలో మెదక్ జిల్లా జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల, హనుమకొండ, హైదరాబాద్, మంచిర్యాల, నిర్మల్ జట్లు సైతం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి
News December 29, 2025
సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభమేంటి?

పచ్చి గడ్డిలో విటమిన్-A అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.


