News December 22, 2025
‘అల్లూరి జిల్లాలో జాఫ్రా మొక్కలకు పెరిగిన డిమాండ్’

అల్లూరి జిల్లాలో జాఫ్రా మొక్కలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతుందని రంపచోడవరం మండలం పందిరిమామిడి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త వెంగయ్య సోమవారం తెలిపారు. తాము గత ఏడాది 5,500 మొక్కలు అందజేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 11,000 మొక్కలు రైతులకు ఇచ్చామన్నారు. ప్రస్తుతం రీసెర్చ్ ప్రాంగణంలో 6,000 మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న రైతులు తమ కార్యాలయంలో సంప్రదించలన్నారు.
Similar News
News December 25, 2025
కృష్ణా: రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం

ఏ కొండూరు మండలం గోపాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన భూక్య కమల (40) రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. కమల మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
News December 25, 2025
తూ.గో: విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

మండపేటలోని ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ట్యూషన్ సమయంలో అసభ్యకర మెసేజులతో వేధిస్తుండటంతో భయపడిన బాలిక పాఠశాలకు వెళ్లడం మానేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఈ నెల 22న విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయుడిని యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.
News December 25, 2025
‘శంబాల’ మూవీ రివ్యూ&రేటింగ్

ఆకాశం నుంచి ‘శంబాల’ గ్రామంలో ఉల్క పడిన తర్వాత ఏం జరిగిందనేదే కథ. సైన్స్, మూఢనమ్మకాలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ అంశాలతో డైరెక్టర్ యుగంధర్ కథను నడిపించారు. హీరో ఆది సాయికుమార్ నటనతో మెప్పించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. శ్రీచరణ్ మ్యూజిక్ మూవీకి ప్లస్. VFXలో క్వాలిటీ లోపించింది. ఫస్టాఫ్ మరింత ఎడిట్ చేయాల్సింది. ఊహకందే కథనం, రొటీన్ క్లైమాక్స్ మైనస్.
రేటింగ్: 2.75/5


