News December 22, 2025
FLASH: HYD: లారీ ఢీకొని SI దుర్మరణం

మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో SI ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రకారం.. ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వైపు బైక్‌పై వెళ్తున్న AR SI రఘుపతి(59)ని నారపల్లి మసీదు సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News December 26, 2025
GNT: పెదకాకాని హైవేపై ప్రమాదం.. చిధ్రమైన శరీరం

పెదకాకాని హైవేపై శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించగా, శరీరం నుజ్జునుజ్జై భయంకరంగా మారింది. మృతదేహం ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా మారింది. దీంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మృతదేహాన్ని గుంటూరు కొవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకాయంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు.
News December 26, 2025
చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ

భారత మహిళా క్రికెటర్ దీప్తీ శర్మ T20I ఫార్మాట్‌లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నారు. శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్, ఓవరాల్‌గా రెండో మహిళగా నిలిచారు. తొలిస్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మేగన్(151) ఉన్నారు. ఇదే మ్యాచ్‌లో 151వ వికెట్‌ను కూడా తీసి ఆమె రికార్డును దీప్తి సమం చేశారు.
News December 26, 2025
చెలరేగిన బౌలర్లు.. లంక 112 రన్స్‌కే పరిమితం

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకను 20 ఓవర్లలో 112/7 పరుగులకే పరిమితం చేశారు. రేణుకా ఠాకూర్ 4, దీప్తీ శర్మ 3 వికెట్లతో చెలరేగారు. లంక బ్యాటర్లలో దులానీ 27, పెరీరా 25, దిల్హరీ 20, నుత్యాంగన 19 మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.


