News December 22, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఇలా ఉన్నాయు. అత్యధికంగా గాంధారి మండలంలో 9.7, రామ్ లక్ష్మణ్‌పల్లిలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, దోమకొండ, మాచారెడ్డి మండలాలలో 10.4, జుక్కల్, డోంగ్లి మండలాలలో 10.5, మహమ్మద్ నగర్ మండలంలో 10.6, పెద్దకొడుపగల్, పాల్వంచ మండలాలలో 10.7 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మిగతా మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News January 7, 2026
నిర్మల్: మున్సిపాలిటీలపై బీజేపీ గురి!

వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న సంకేతాలు వెలువుడుతుండడంతో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. కాంగ్రెస్, BRS, ఎంఐఎం పార్టీల కంటే BJP ఓ అడుగు ముందుకు వేసి కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్ పదవులను దక్కించుకొని ఛైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ ఎన్నికల్లో అదే ఊపు కొనసాగింది.
News January 7, 2026
డోర్నకల్ ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకరా.. క్యాబినెట్‌లోకా?

డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.రాంచంద్రు నాయక్‌ను రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలు రెండు సార్లు జరిగాయి. డిప్యూటీ స్పీకర్ పై అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేయకపోవడంతో గిరిజన ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌ను క్యాబినెట్లో తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. CM రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే బుధవారం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు.
News January 7, 2026
ఢిల్లీ పొల్యూషన్.. రెండో రాజధానే సొల్యూషనా?

పొల్యూషన్‌కు పర్యాయపదంగా ఢిల్లీ మారిపోయింది. దీంతో ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. దేశ పరిపాలనా వ్యవహారాలకూ ఇబ్బంది కలుగుతోంది. హరియాణా, పంజాబ్‌లలో పంట వ్యర్థాల కాల్చివేతలతోపాటు లెక్కకుమించిన వాహనాలూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీంతో దక్షిణాదిలో రెండో రాజధాని ఏర్పాటు వాదన బలపడుతోంది. దీనివల్ల ఢిల్లీపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. మరి ఏ నగరం రెండో రాజధానికి అనుకూలం? కామెంట్


