News December 22, 2025

అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజలు అందించిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించి నివేదిక అందజేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 25, 2026

MHBD: యువతకు ఓటు ఆయుధం.. వెంటనే నమోదు చేసుకోండి!

image

18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఓటు ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News January 25, 2026

సిద్దిపేట: ‘ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి’

image

టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్, ఆర్ఆర్‌బీ, ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫౌండేషన్ కోర్సు ద్వారా నిపుణులతో నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 25, 2026

తూ.గో జిల్లా వాసికి పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

image

రాజమండ్రికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గతంలో టీటీడీ, అహోబిలం, కంచికోటి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. అన్నమాచార్య సంకీర్తనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. వేలాది కీర్తనలకు స్వరకల్పన చేసిన గరిమెల్లకు ఈ గౌరవం దక్కడంపై సంగీత ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.