News December 22, 2025
అల్లూరి: చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

ఎటపాక మండలం K.N.పురం బాలుర ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న తెల్లం గౌతం అనారోగ్యం కారణంగా సోమవారం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విద్యార్థిది ఎటపాక మండలం కృష్ణవరం. విద్యార్థి కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా గౌతమ్ 6వ తరగతి నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు.
Similar News
News January 13, 2026
ధనుర్మాసం: ఇరవై తొమ్మిదో రోజు కీర్తన

కృష్ణుడిని సేవిస్తూ అండాళ్ తెలిపిన వ్రత పరమార్థం ఇది: ‘ఓ గోవిందా! మేము వేకువనే నీ సన్నిధికి వచ్చింది కోరికలు నెరవేర్చమని కాదు! మా జన్మజన్మల బంధం నీతోనే ఉండాలని, ఏడేడు జన్మల వరకు నీకే దాస్యం చేస్తూ నీ సేవలో తరించాలని! మా మనసులో ఉండే ఇతర కోరికలను తొలగించు. నీ పాద సేవ పట్ల అనురక్తిని ప్రసాదించు’ అని భగవంతుడిని ఏమీ ఆశించకుండా, నిరంతర సేవా భాగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇదే నిజమైన భక్తి. <<-se>>#DHANURMASAM<<>>
News January 13, 2026
జగిత్యాల: గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్.. 114 పాస్‌పోర్టులు స్వాధీనం

జగిత్యాల పట్టణంలో కన్సల్టెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గల్ఫ్ ఏజెంట్ కాముని గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 114 పాస్‌పోర్టులు, ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు DSP రఘు చందర్ వెల్లడించారు. పెంబట్లకు చెందిన గంగాధర్ అమాయకులను నమ్మించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారంతో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.
News January 13, 2026
SBI ఖాతాదారులకు అలర్ట్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ATMల్లో ఫ్రీ ట్రాన్సాక్షన్లు సంఖ్య (నెలకు 5) కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ప్రతి విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేయనుంది. ఇక బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్ తీసినా రూ.11 కట్ కానున్నాయి. శాలరీ ఖాతాదారులు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం. పెరిగిన ఛార్జీలు 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.


