News December 22, 2025

HYD: మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి: సీపీ

image

రాచకొండ సీపీ సుధీర్ బాబు 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించి, రూ.20 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుల్లో 495 మందిని అరెస్ట్ చేయగా, అందులో 322 మంది స్థానికులు, మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందినవారని, 227 NDPS అనుమానిత షీట్లు తెరిచారమన్నారు. రాచకొండను నాన్-బెయిలబుల్ వారెంట్ ఫ్రీ కమిషనరేట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

Similar News

News January 12, 2026

నేటి ముఖ్యాంశాలు

image

✹ ఇండియా ధైర్యానికి సజీవ సాక్ష్యమే సోమనాథ్: మోదీ
✹ AP: రూ.1750 కోట్లతో NTR విగ్రహం: నారాయణ
✹ గోదావరి వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి: మంత్రి నిమ్మల
✹ TG: ధరణి లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా ఆడిటింగ్: పొంగులేటి
✹ సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు
✹ న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో భారత్ విజయం

News January 12, 2026

ఢిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ

image

WPL-2026: ఢిల్లీతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో గుజరాత్‌ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 205 రన్స్ చేసింది. చివరి ఓవర్లో DC 7 పరుగులు చేయాల్సి ఉండగా సోఫీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి 2 రన్స్ మాత్రమే ఇచ్చారు. 18, 19వ ఓవర్లలో జెమీమా సేన 41 రన్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇది గుజరాత్‌కు రెండో విజయం.

News January 12, 2026

అనంతపురం శిల్పారామంలో 14న సంక్రాంతి సంబరాలు

image

అనంతపురంలోని శిల్పారామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3 రోజులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సంబరాలను నిర్వహిస్తామన్నారు.