News December 22, 2025
పర్సనాలిటీ రైట్స్ అంటే ఏమిటి?

పవన్, NTR సహా అనేక మంది <<18542046>>సెలబ్రిటీలు<<>> పర్సనాలిటీ రైట్స్ కోసమంటూ ఢిల్లీ కోర్టుకెళ్తున్నారు. అసలేంటీ రైట్స్? తమ ఐడెంటిటీ(నేమ్, ఇమేజ్, వాయిస్, సైన్ etc)ని అనుమతి లేకుండా లబ్ధి(ఆర్థికంగా లేదా అవమానించేలా) కోసం ఇతరులెవరూ SM, ఈకామర్స్‌లో వాడుకోకుండా అడ్డుకోవడానికి ఈ పిటిషన్లు వేస్తున్నారు. ఇండియాలో ఈ రైట్స్‌ను ప్రత్యేకంగా నిర్ధారించలేదు. కానీ ART 21(జీవించే హక్కు) కింద కోర్టులు పరిగణిస్తున్నాయి.
Similar News
News December 24, 2025
అపరాలకు బంగారుతీగ కలుపు ముప్పు ఎక్కువ

మినుము, పెసర, కందిని ఆశించి నష్టపరిచే కలుపు మొక్కలలో బంగారుతీగ ముఖ్యమైనది. ఇది ఆశించిన పైర్లలో పెరుగుదల లోపిస్తుంది. దిగుబడులు భారీగా తగ్గిపోతాయి. పొలంలో ఒకసారి బంగారుతీగ విత్తనాలు పడితే కొన్నేళ్ల వరకు మొలుస్తాయి. అందుకే ఈ కలుపు మొక్కను పొలంలో గుర్తిస్తే విత్తనం ఏర్పడక ముందే వాటిని పీకి నాశనం చేయాలి. అలాగే మొక్కజొన్న, జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 24, 2025
భయం వద్దు.. భవిష్యత్తు మనదే: AI సృష్టించిన కోటీశ్వరులు

AI వల్ల ఓవైపు జాబ్స్ పోతాయని టెన్షన్ పడుతుంటే మరోవైపు కొంతమంది దీన్ని వాడుకుని రూ.కోట్లు సంపాదిస్తున్నారు. ఈ ఏడాది 30ఏళ్లలోపున్న 13 మంది యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ బిలియనీర్లుగా మారారు. చిన్న టీమ్స్‌తోనే AI సాయంతో ప్రపంచ స్థాయిలో సక్సెస్ అయ్యారు. బ్రెజిల్‌కు చెందిన బాలే డాన్సర్ లువానా లారా దీనికి ఉదాహరణ. Kalshi అనే Prediction Market స్టార్టప్‌తో సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.
News December 24, 2025
400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బ్యాంక్ ఆఫ్ ఇండియా 400 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు రేపటి నుంచి జనవరి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.13,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/


