News December 22, 2025

HYD: పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్ షురూ..!

image

HYD వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొనాలని పలు పాఠశాలల అధ్యాపకులు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా పరీక్షల భయం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. పరీక్షల సిద్ధత, సమయ నిర్వహణ, ఒత్తిడి నియంత్రణ కోసం lnkd.in/gmVK9VD4 లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని, పాల్గొనండి.

Similar News

News January 17, 2026

IAFకి మరింత బలం.. 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం

image

ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డు మరో 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ₹3.25లక్షల కోట్ల విలువైన ఈ డీల్‌కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, క్యాబినెట్ కమిటీ ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. FEBలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ IND పర్యటనలో డీల్ ఫైనలైజ్ అవ్వొచ్చు. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ సహకారంతో 60%+ స్వదేశీ కంటెంట్‌తో ఇవి తయారు కానున్నాయి. IND రాఫెల్స్ సంఖ్య 176కి పెరగనుంది.

News January 17, 2026

TU: ఈ నెల 21 నుంచి పరీక్షలు

image

టీయూ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH)-3, 5, IMBA-3, 5, LLB, LLM-3, B.Ed, B.P.Ed-1,3వ సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయని COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. LLB పరీక్షలు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 4 వరకు, LLM పరీక్షలు ఈ నెల 21, 23 తేదీల్లో, ఇంటిగ్రేటెడ్ PG, IMBA పరీక్షలు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు B.Ed పరీక్షలు 21 నుంచి 31 వరకు, B.P.Ed 21 నుంచి 24 వరకు జరగనున్నాయి.

News January 17, 2026

ఉమ్మడి వరంగల్‌లో 260 వార్డులకు రిజర్వేషన్లు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 మున్సిపాలిటీలలోని 260 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 260 వార్డుల్లో 21 వార్డులు ఎస్టీల జనరల్‌కు, ఎస్టీ(మ) 15, ఎస్సీ(జ) 26, ఎస్సీ(మ) 18, బీసీ(మ) 29, బీసీ(జ) 21, జనరల్ 75, జనరల్ మహిళకు 56 వార్డులను రిజర్వ్ చేశారు. మున్సిపాలిటీలతో పాటుగా గ్రేటర్ వరంగల్ డివిజన్లకు రిజర్వేషన్లు చేశారు.