News April 22, 2024

నేడు డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 9వ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే నెల 21న హాల్ టికెట్లు, 24న పరీక్ష, మే 30న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 6వ తేదీ నుంచి కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదు, 12 నుంచి 15 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.

Similar News

News October 15, 2024

కృష్ణ జింకల కోసం ప్రాణాలను సైతం పణంగా..!

image

బిష్ణోయ్ తెగ ప్రజలు కృష్ణ జింక‌ల్ని వారి ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుని పునర్జన్మగా భావిస్తుంటారు. 15వ శతాబ్దంలో 29 సూత్రాలతో గురు జంభేశ్వర్ (జంబాజీ) బిష్ణోయ్ సంఘాన్ని స్థాపించారు. ఇందులో వన్యప్రాణులు, వృక్షసంపదను రక్షించాలని ఉంది. బిష్ణోయ్ తెగ వారు జింకలుగా పునర్జన్మ పొందుతారని నమ్ముతారు. ఈ జంతువులను రక్షించడానికి బిష్ణోయిలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారని చరిత్రకారుడు వినయ్ పరిశోధనలో తేలింది.

News October 15, 2024

‘ఆమడ దూరం’ వెళ్లొస్తా.. అంటే ఎంత దూరం?

image

పూర్వీకులు ఆమడ దూరం అనే పదాన్ని ఎక్కువగా వాడేవారు. ఏదైనా ప్రాంతం ఎంత దూరంలో ఉందో చెప్పేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే, ఇలా చెప్పేవారికీ అది ఎంతదూరమో తెలియదనేది వాస్తవం. ఆంగ్లేయులు రాకముందు భారతీయులు కొలతల్లో ‘ఆమడ’ను వినియోగించేవారు. దీన్నే యోజనం అని కూడా పిలుస్తారు. అతి చిన్న కొలత అంగుళమైతే.. అతిపెద్దది ‘ఆమడ’. 8 మైళ్ల దూరాన్ని ఆమడ అంటారు. అంటే దాదాపు 13 కిలోమీటర్లని పెద్దలు చెప్తుంటారు.

News October 15, 2024

84 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం

image

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవసీ పాలసీని ఉల్లంఘించిన 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఒక్క ఆగస్టులోనే ఈ సంఖ్యలో నిషేధం విధించినట్లు పేర్కొంది. వీటిలో అనుమానాస్పదంగా ఉన్న 16.61 లక్షల అకౌంట్లను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ముందుగానే గుర్తించి జాగ్రత్త చర్యగా బ్యాన్ చేసినట్లు తెలిపింది. కాగా ఆగస్టులో వాట్సాప్ గ్రీవెన్స్‌కు 10,707 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది.