News December 22, 2025
కామారెడ్డి: ప్రజావాణిలో 60 దరఖాస్తులు

కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో మొత్తం 60 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. తక్షణమే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News January 5, 2026
పుట్టపర్తి ఎస్పీ కార్యాలయానికి 85 ఫిర్యాదులు

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎక్కువగా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక వివాదాలు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన ప్రజల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పోలీస్ అధికారులు సంబంధిత ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 5, 2026
అనకాపల్లి: ప్రజా ఫిర్యాదుల వేదికలో 47అర్జీలు

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక (PGRS)లో మొత్తం 47 అర్జీలు స్వీకరించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్ ఫిర్యాదులను స్వీకరించారు. భూతగాదాలు 22, కుటుంబ కలహాలు 3, మోసపూరిత కేసులు 2, ఇతర విభాగాలవి 20 ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా 7 రోజుల్లో పరిష్కరించాలని ఆయన అధికారులు ఆదేశించారు.
News January 5, 2026
సంగారెడ్డి: మైనార్టీ మహిళలకు కొత్త పథకాలు

మైనార్టీ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ‘రేవంత్ అన్నా కా సహారా – మిస్కీన్ కేలియే’, ‘ఇందిరమ్మ మైనార్టీ’ అనే రెండు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందని సంగారెడ్డి జిల్లా మైనార్టీ అధికారి విశాలాక్షి తెలిపారు. ఈ పథకాలకు అర్హులైన వారు ఈనెల 10లోగా <


