News December 22, 2025
వివాదాలపై వెంటనే చర్యలు తీసుకోండి : SP

అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమంలో భాగంగా SP ధీరజ్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. సివిల్, కుటుంబ, ఆస్తి వివాదాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన దివ్యాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు, మహిళలు, వికలాంగుల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
Similar News
News January 10, 2026
WPL: RCB అద్భుత విజయం

WPL 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ చివరి ఓవర్‌లో ఛేదించింది. చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరమైన వేళ డి క్లెర్క్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. తీవ్ర ఒత్తిడిలోనూ ఆమె అద్భుత షాట్లతో విరుచుకుపడి టాప్ స్కోరర్‌గా (63) నిలిచారు. మరోవైపు బౌలింగ్‌లోనూ ఆమె సత్తా (నాలుగు ఓవర్లలో 4 వికెట్లు) చాటారు.
News January 10, 2026
నెల్లూరు ఎస్పీని అభినందించిన హోం మంత్రి

నెల్లూరు ఎస్పీ అజితా వేజండ్లను హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు. నెల్లూరు జిల్లా జైలును ఆమె తనిఖీ చేశారు. జిల్లాలో మంచి సంస్కృతి నెలకొందని చెప్పారు. రౌడీ షీటర్లు, పీడీ యాక్ట్, రప్పా రప్పా అంటూ కత్తులతో తిరిగే బ్యాచ్‌ను రోడ్లమీద నడిపించడాన్ని మంత్రి అభినందించారు. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News January 10, 2026
హైదరాబాద్‌లో ‘టెర్రస్’ వార్!

సిటీలో సంక్రాంతి ముందే వచ్చేసింది. శుక్రవారం సాయంత్రం ఓల్డ్ సిటీ, అశోక్‌నగర్, తార్నాక, మల్కాజిగిరి గల్లీల్లో ఎటు చూసినా పతంగిల సందడే. అపార్ట్‌మెంట్ టెర్రస్ యాక్సెస్ ఒక ‘స్టేటస్ సింబల్’గా మారగా ఇండిపెండెంట్ హౌసెస్ మీద లోకల్ స్లాంగ్‌తో పందేలు కాస్తున్నారు. ఒక మేడ మీద పాత తెలుగు హిట్లు, పక్క బిల్డింగ్‌లో మాస్ బీట్ల మధ్య ‘కాటే’ కేకలు ఊదరగొడుతున్నాయి. ఈ ‘టెర్రస్ వార్’ ఇప్పుడు పీక్స్‌కు చేరింది.


