News December 22, 2025

భద్రాద్రి: అరుదైన ఆపరేషన్.. అభినందించిన ఎమ్మెల్యే, కలెక్టర్

image

కొత్తగూడెంలో నూడిల్స్ బండి నడిపే పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిశాల్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లోతుగా తెగడంతో ఆశలు వదులుకున్నారు. గొంతు స్పెషలిస్ట్ డా.రవిబాబు 2 గంటలు శ్రమించి పాల్వంచ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. భద్రాచలం ఐసీయూలో రెండు వారాలు చికిత్స అందించి సోమవారం డిశ్చార్జ్ చేశారు. రవిబాబుతో పాటు పాల్వంచ, భద్రాచలం ఆసుపత్రి సిబ్బందిని ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

Similar News

News January 20, 2026

ఫిబ్రవరి 3 నుంచి కేయూ పీజీ పరీక్షలు

image

KU పీజీ (నాన్- ప్రొఫెషనల్) మూడో సెమిస్టర్ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ను కొన్ని విద్యార్థి సంఘాల విన్నపం మేరకు సవరించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు మార్పు చేసిన పూర్తి వివరాలను కేయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

News January 20, 2026

మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

image

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News January 20, 2026

కామారెడ్డి: రేపటి నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు

image

ఇంటర్మీడియట్ విద్యార్థులకు రేపటి నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయని కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. 21న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, 22న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆయా జూనియర్ కళాశాలలో పరీక్షలు ఉంటాయన్నారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు సకాలంలో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాలని ఆయన సూచించారు.