News December 22, 2025

పార్వతీపురం: పీజీఆర్ఎస్‌కు 185 వినతులు

image

ప్ర‌జా సమస్యలను ప‌రిష్కారం చేయడంలో అధికారుల తీరు మారాల‌ని క‌లెక్ట‌ర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. నవంబర్ మాసంలో అర్జీల పరిష్కారంలో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 185 వినతులు స్వీకరించారు.

Similar News

News January 11, 2026

Bullet Train: ఆలస్యం ఖరీదు ₹88వేల కోట్లు!

image

ఇండియాలో తొలి బుల్లెట్ రైలు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రాజెక్టు నాలుగేళ్లు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం ఏకంగా 83% పెరిగింది. దాదాపు ₹1.1 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా తాజాగా ₹1.98 లక్షల కోట్లకు అంచనా పెరిగింది. ఇప్పటిదాకా ₹85,801 కోట్లు ఖర్చయ్యాయి. సూరత్, బిలిమోరా మధ్య <<18733757>>తొలి విడతలో <<>>2027 ఆగస్టులో ట్రైన్ పట్టాలెక్కనుంది. 508KM మొత్తం ప్రాజెక్టు(ముంబై-అహ్మదాబాద్) 2029 డిసెంబర్‌కు పూర్తి కానుంది.

News January 11, 2026

శ్రీకాకుళం: మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం

image

శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం సాయంత్రం ఆయనను ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. కుటుంబ సభ్యులు వైద్యుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి బులిటెన్ విడుదల కాలేదు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.

News January 11, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ ఈ బయ్యారంలో హోరాహోరీగా కబడ్డీ పోటీలు
✓ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు అశ్వాపురం విద్యార్థి ఎంపిక
✓ ప్రశాంతంగా టెట్ పరీక్షలు: భద్రాద్రి కలెక్టర్
✓ అశ్వాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
✓ రేపు ఆళ్లపల్లి, గుండాల మండలంలో పవర్ కట్
✓ పాల్వంచ పెద్దమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
✓ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యం: సీపీఐ
✓ రేపు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన