News December 22, 2025
కుష్టు వ్యాధి సర్వేను పరిశీలించిన భద్రాద్రి DM&HO

జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా.తుకారామ్ రాథోడ్ బూర్గంపాడు, గౌతమ్ పూర్ గ్రామాల్లో జరుగుతున్న కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమ సర్వేను పరిశీలించారు. బూర్గంపాడు జూనియర్ కళాశాలలో జరిగిన జాతీయ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ కార్యక్రమంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను పరిశీలించారు. ఈ వైద్య శిబిరాల్లో మొరంపల్లి బంజర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 25, 2025
GNT: ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ.!

అమరావతి ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ అయింది. కేంద్రం ఇప్పటివరకు గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలకు గెజిట్ విడుదల చేసింది. 4 జిల్లాలో మొత్తం 189.90 Km మేర ORR నిర్మించనున్నారు. గుంటూరు జిల్లాలో 67.65Km, పల్నాడులో 17.23Km మేర నిర్మించనున్నారు. ORR ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోపు భూసేకరణను కొలిక్కి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
News December 25, 2025
DGP ఎంపికపై కీలక ఆదేశాలు

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
News December 25, 2025
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్..

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో 422గా నమోదు కావటం గమనర్హం.
SHARE IT


