News December 22, 2025
గంగాధర: సర్పంచ్ మొదటి తీర్మానం.. రూపాయికే అంత్యక్రియలు!

బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కరీంనగర్(D) గంగాధర(M) బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే కేవలం ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించేలా తొలి పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ వినూత్న పథకం బూరుగుపల్లి జిల్లాలోనే ప్రత్యేకంగా నిలిచింది. పరిమిత వనరులున్నా పేదలకు అండగా నిలవాలనే సర్పంచ్ సంకల్పంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Similar News
News December 25, 2025
GNT: ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ.!

అమరావతి ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ అయింది. కేంద్రం ఇప్పటివరకు గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలకు గెజిట్ విడుదల చేసింది. 4 జిల్లాలో మొత్తం 189.90 Km మేర ORR నిర్మించనున్నారు. గుంటూరు జిల్లాలో 67.65Km, పల్నాడులో 17.23Km మేర నిర్మించనున్నారు. ORR ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోపు భూసేకరణను కొలిక్కి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
News December 25, 2025
DGP ఎంపికపై కీలక ఆదేశాలు

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
News December 25, 2025
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్..

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో 422గా నమోదు కావటం గమనర్హం.
SHARE IT


