News December 22, 2025
ఇండియాలో ఫస్ట్ క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారైంది?

కేరళ రాష్ట్రం తలస్సేరిలో 1883లో మొదటిసారి క్రిస్మస్ కేక్ తయారైంది. యూరోపియన్ రెసిపీ ఫ్రూట్ కేక్‌ను ఇండియన్స్‌కు నచ్చేలా మాంబల్లిలోని రాయల్ బిస్కెట్ ఫ్యాక్టరీలో వెస్టర్న్ బేకింగ్ పద్ధతులను ఉపయోగించి బాపు తయారు చేశారు. కేరళ ప్లమ్ కేక్‌గా పాపులర్ అయిన దీని టేస్ట్‌కు భారతీయులు ఫిదా అయ్యారు. అప్పట్లో క్రిస్మస్ టైమ్‌లో తయారు చేసి అమ్మేవారు. కేరళలో మొదలైన క్రిస్మస్ కేక్ కల్చర్ నేడు దేశమంతా వ్యాపించింది.
Similar News
News January 14, 2026
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబై విజయం

WPL-2026లో గుజరాత్‌తో జరిగిన మ్యాచులో ముంబై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్(71*) అర్ధసెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చారు. <<18849934>>193<<>> పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కమలిని(13), మాథ్యూస్(22) విఫలమయ్యారు. ఆ తర్వాత అమన్‌జోత్(40)తో కలిసి హర్మన్ 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత వచ్చిన కేరీ(38*) మెరుపులు తోడవ్వడంతో ముంబై ఈ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసింది. గుజరాత్‌కు ఇది తొలి ఓటమి.
News January 14, 2026
అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించేందుకు AI టూల్: MH సీఎం

అక్రమ బంగ్లాదేశీయుల అంశం ప్రధాన సమస్య అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. వారిని గుర్తించేందుకు IIT బాంబేతో కలిసి AI టూల్‌ను తాము అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్క్ కొనసాగుతోందని, AI టూల్ సక్సెస్ రేటు 60 శాతంగా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా ముంబైకి వచ్చిన బంగ్లా పౌరులను పంపించేందుకు డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు.
News January 14, 2026
WPLలోనే తొలి ప్లేయర్

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన తొలి ప్లేయర్‌గా గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ ఆయుషి సోనీ రికార్డులకెక్కారు. ముంబైతో మ్యాచులో 11 బంతుల్లో 14 పరుగులు చేసిన ఆమె భారీ షాట్లు ఆడటంలో తడబడ్డారు. దీంతో చేసేదేమీ లేక రిటైర్డ్ ఔట్‌గా క్రీజును వీడారు. ఆ తర్వాత వచ్చిన ఫుల్మాలి 15 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 36 రన్స్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.


