News December 22, 2025
బాల్యవివాహాలు సమాజానికి శాపం: నంద్యాల కలెక్టర్

బాల్యవివాహాలు పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బాల్యవివాహాల నిర్మూలనపై వందరోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రతిజ్ఞ చేశారు. చట్టప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చేయడం నేరమని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News December 31, 2025
విచారణలో పోలీసులకే iBOMMA రవి ప్రశ్నలు

12 రోజుల విచారణలో పోలీసులకూ iBOMMA రవి పలు ప్రశ్నలు వేశాడని సమాచారం. తానే iBOMMA సైట్ రన్ చేస్తున్నట్లు ప్రూఫ్ ఏంటి? అని రవి ప్రశ్నించాడట. అటు అరెస్టుకు ముందూ ఈ తరహా స్పందన ఎదురైందట. VR ఇన్ఫోటెక్ పేరిట iBOMMA, బప్పంtv సైట్స్ రిజిస్టర్ అయ్యాయని తెలిసి పోలీసులు మెయిల్ చేశారు. దీంతో ‘వాటికి సర్వీస్ ఇస్తున్నానంతే, అందులో పైరసీ మూవీస్ లేవు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే పంపండి’ కౌంటర్ క్వశ్చన్ చేశాడట.
News December 31, 2025
2025 అనంతపురం జిల్లా క్రైమ్ రిపోర్ట్ విడుదల

* 2024తో పోలిస్తే 2025లో నేరాలు 22.5 శాతం తగ్గుదల
* కేసులు 8,841 నుంచి 6,851కు తగ్గుముఖం
* 55 శాతం చోరీ కేసులు రికవరీ
* జిల్లాలో 42 హత్యలు
* గణనీయంగా తగ్గిన మహిళలపై నేరాలు, పోక్సో కేసులు
* మిస్సింగ్ కేసుల్లో 613 మంది సురక్షితం
* 9 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు
* 544 నుంచి 496కు తగ్గిన ప్రమాదాలు
* 22 మందికి గంజాయి కేసుల్లో జైలు శిక్ష పడేలా చర్యలు
News December 31, 2025
నల్గొండ: ‘ఆపరేషన్ చబుత్ర’తో పోలీసుల తనిఖీలు

నల్గొండ జిల్లాలో నేరాలు, రోడ్డు ప్రమాదాల అదుపునకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో చేపట్టిన ‘ఆపరేషన్ చబుత్ర’ సత్ఫలితాలనిస్తోంది. 30 బృందాలతో చేపట్టిన విస్తృత తనిఖీల్లో డ్రంకెన్ డ్రైవ్ కింద 337 కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 300 మంది యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.


