News April 22, 2024
పవన్ కళ్యాణ్ సభలో చాకుతో యువకుడు?

పవన్ భీమవరం సభలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రకాశం చౌక్‌లో పవన్ మాట్లాడుతుండగా.. ఇద్దరి కదిలికలపై అనుమానంతో పోలీసులు పట్టుకునేందుకు యత్నించారట. ఓ యువకుడు చాకుతో దాడికి దిగగా.. అతడిని, దుర్గాపురానికి చెందిన మరో యువకుడిని సైతం స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వీరు జేబు దొంగతనాలకు వచ్చారా..?, మరేదైనా కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News October 11, 2025
పాపికొండల విహారయాత్ర స్టార్ట్

గోదావరి వరదల నేపథ్యంలో నిలిచిన పాపికొండల విహారయాత్రను మొదలెట్టేందుకు శనివారం నుంచి అనుమతి ఇచ్చామని జలవనరుల శాఖ ఏఈ భాస్కర్ తెలిపారు. నదిలో వరద కారణంగా జులై 11వ తేదీన విహారయాత్ర బోట్లను నిలిపి వేశారు. 3 నెలల అనంతరం మళ్లీ పాపికొండల అందాలను చూసేందుకు టూరిస్టులకు అవకాశం లభించింది. గండి పోచమ్మ ఆలయం, పురుషోత్త పట్టణం నుంచి బోట్లు బయలుదేరనున్నాయి.
News October 11, 2025
యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు -DCHS ప్రియాంక

తూ.గో జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పరిధిలో ఉచిత వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని DCHS ప్రియాంక తెలిపారు. సమ్మె ప్రభావం కారణంగా జిల్లా ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకావొద్దన్నారు. సాధారణంగా ఉచిత వైద్య సేవలను పొందవచ్చునని తెలిపారు. రోగులకు ప్రతి విభాగంలో ఉచిత వైద్య సేవలు అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యలుంటే 9281068129, 9281068159 నంబర్లలో సంప్రదించాలన్నారు.
News October 10, 2025
తూ.గో జిల్లాలో ‘నూరు శాతం ఈ క్రాప్ పూర్తి’

తూ.గో జిల్లాలో వరి పంటకు నూరు శాతం ఈ క్రాప్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయన్నారు. రాజమండ్రి రూరల్ 16 , కొవ్వూరు 96, నల్లజర్ల 50, నిడదవోలు 20, గోపాలపురం 10, దేవరపల్లి 35, చాగల్లులో 25 ఎకరాల్లో వరి కోతలు పూర్తి చేశారన్నారు.