News December 22, 2025
జగిత్యాల: డూప్లికేట్, బ్లర్ ఎంట్రీల సవరణపై దృష్టి

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తహశీల్దార్లను ఆదేశించారు. డూప్లికేట్ ఎంట్రీలు, సమాన వివరాలు, బ్లర్ ఫోటోలు సరిదిద్దాలని సూచించారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఓటరు జాబితా రూపొందించాలని తెలిపారు.
Similar News
News January 12, 2026
కడప: పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం.. 11మంది MROలకు నోటీసులు

రైతులకు పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొరడా ఝులిపించారు. ఈనెల 2 నుంచి 9వరకు రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించినా అలసత్వం వహించిన తొండూరు MROను కలెక్టర్ సస్పెండ్ చేశారు. చెన్నూరు, పెండ్లిమర్రి, VNపల్లె, గోపవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, B.మఠం, ప్రొద్దుటూరు, CKదిన్నే MROలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
News January 12, 2026
రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్ టోర్నమెంట్ విజేతలు వీరే..!

కారంచేడు రామానాయుడు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. మొదటి బహుమతి గుంటూరుకు చెందిన జితేంద్ర టీం, రెండో బహుమతి గన్నవరానికి చెందిన మహీధర్ టీం, మూడో బహుమతి నరసరావుపేటకు చెందిన ధీరజ్ టీం, నాలుగో బహుమతి కారంచేడుకు చెందిన జగన్ టీం గెలుచుకున్నారు. విజేతలకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందించారు.
News January 12, 2026
యాదాద్రి: వారిపై క్రిమినల్ కేసులు: కలెక్టర్

సాంకేతికత దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం చట్ట విరుద్ధమని, జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించి జమ చేసిన ఫైల్స్ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై విచారణకు అదేశించారు.


