News December 22, 2025

వరంగల్: మాజీ ACP, CI, SI సస్పెండ్

image

గతంలో వరంగల్ ఏసీపీగా విధులు నిర్వహించిన నందిరాం నాయక్‌తో పాటు ప్రస్తుతం సీసీఎస్ CI గోపి, ఎస్ఐ విఠల్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు నమోదు చేసినట్లుగా ఫిర్యాదులందడంతో, దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు.

Similar News

News December 31, 2025

ఇన్నోవికాస్-2025లో భాగస్వామ్య ఒప్పందం

image

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో వికాస్ ఇంజినీరింగ్ కళాశాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని హబ్ CEO జి. కృష్ణన్ వెల్లడించారు. వికాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్నాలజీ ప్రదర్శన ‘ఇన్నోవికాస్-2025’ రెండో రోజు కొనసాగింది. సస్టైనబుల్ అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా విద్యార్థులు రూపొందించిన కొత్త ఆలోచనలు, నమూనాలను హబ్ ద్వారా సాంకేతికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

News December 31, 2025

సిద్దిపేట జిల్లాలో 74.65% పూర్తి

image

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 686 రేషన్‌ దుకాణాలు ఉండగా వీటి పరిధిలో 3,31,102 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 10,28,265 యూనిట్లు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 6529.735 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మొత్తం యూనిట్లలో ఇప్పటివరకు 7,67,585 యూనిట్లకు చెందిన వారు ఈకేవైసీ పూర్తి చేయించుకోగా 74.65% ఈకేవైసీ పూర్తయింది. ఈ నెల 31నాటికి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News December 31, 2025

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

image

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తన మూడో కూతురి పెళ్లి చేశాడు. తన సోదరుడి కుమారుడు అబ్దుల్ రహమాన్‌కు ఇచ్చి రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో DEC 26న వివాహం జరిపించాడని నేషనల్ మీడియా పేర్కొంది. ఈ వేడుకకు పాక్ అధ్యక్షుడు, ప్రధాని, ISI చీఫ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా మునీర్‌కు నలుగురు కూతుళ్లు. అబ్దుల్ రహమాన్‌ ఆర్మీలో పని చేసి రిజర్వేషన్ కోటాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు.