News April 22, 2024

VZM: మూడు రోజుల్లో జిల్లాకు ముగ్గురు అధినేతలు

image

విజయనగరంలో పొలిటికల్ హీట్ పెరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుసగా మూడు రోజులు మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు ఈరోజు ఎస్.కోట, రేపు గజపతినగరంలో నియోజకవర్గంలో పర్యటిస్తారు. 23న సాయంత్రం 4 గంటలకు విజయనగరం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. 24న నెల్లిమర్ల, విజయనగరం జిల్లాలో జరిగే ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొంటారు.

Similar News

News September 27, 2025

VZM: ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం..!

image

జిల్లాలోని రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో 17, బొబ్బిలిలో 27, చీపురుప‌ల్లిలో 4, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో 3, నెల్లిమ‌ర్ల‌లో 4, విజ‌య‌న‌గ‌రంలో 61, ఎస్‌.కోట నియోజ‌క‌వ‌ర్గంలో 10 మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువ‌గా ఓట‌ర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, త‌ర‌లింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు.

News September 27, 2025

పొక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష: SP

image

పొక్సో కేసులో జమ్ము నారాయణపట్నానికి చెందిన అప్పారావుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానాను కోర్టు విధించిందని SP దామోదర్ శుక్రవారం తెలిపారు. 7 ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడనే తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారన్నారు. నేరం రుజువు కావడంతో 10 నెలల్లోనే శిక్ష ఖరారైందన్నారు. బాధితురాలికి రూ.3లక్షల పరిహారం మంజూరైందన్నారు.

News September 27, 2025

నేడే అమృత్ భారత్ రైలు ప్రారంభం.. ఉమ్మడి జిల్లాలో స్వాగత ఏర్పాట్లు

image

బ్రహ్మాపూర్–సూరత్ ‌మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌(09022) సేవలు నేడు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ శనివారం ఉదయం 10.45కి VC ద్వారా ప్రారంభించనున్నారు.
➤విజయనగరం మధ్యాహ్నం 3.40కి చేరుకోగా.. సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది
➤బొబ్బిలికి సాయంత్రం 4.45కి చేరుకొని 4.55కి బయలుదేరుతుంది
➤పార్వతీపురం 5:15కి చేరుకొని 5.25కి బయలుదేరుతుంది
ఆయా స్టేషన్లలో అధికారులు స్వాగత ఏర్పాట్లు పూర్తి చేశారు.