News December 22, 2025

VZM: నాన్నమ్మను హత్య చేసిన మనవడు

image

భోగాపురం మండలం ముడసలపేట గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. నాన్నమ్మను హత్య చేసిన మనవడు ముడసల గౌరి (27)ను అరెస్టు చేసినట్లు SP దామోదర్ సోమవారం తెలిపారు.మద్యం మత్తులో నిందితుడు నాన్నమ్మ అప్పయ్యమ్మను హత్య చేసి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడి వద్ద నుంచి 18.250 గ్రాముల బంగారు వస్తువులు, 106 గ్రాముల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Similar News

News December 26, 2025

‘రుషికొండ’ను TTDకి అప్పగించాలి: BJP MLA

image

AP: విశాఖపట్నం రుషికొండ భవనాలను, కింద ఉన్న మరికొంత భూమిని ప్రముఖ హోటళ్లకు కేటాయించేలా ఇటీవల మంత్రుల కమిటీ చర్చించడం తెలిసిందే. ఈనెల 28న తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా BJP MLA విష్ణు కుమార్ రాజు దీనిపై స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ‘రుషికొండను ఆదాయవనరుగా చూడొద్దు. హోటళ్లకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుంది. TTDకి అప్పగించి ఆధ్యాత్మిక సిటీగా మార్చాలి’ అని కోరారు.

News December 26, 2025

KMR: రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

image

కామారెడ్డిలోని పంచముఖి హనుమాన్ కాలనీ రైల్వే ట్రాక్ సమీపంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా? లేదా ఆత్మహత్యనా? అన్న కోణంలో విచారిస్తున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు.

News December 26, 2025

ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఇవే?

image

నిన్న విడుదలైన ఛాంపియన్, శంబాల, దండోరా, ఈషా సినిమాలు పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాయి. శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’కు తొలిరోజు రూ.4.50 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఆది సాయికుమార్ నటించిన శంబాల మూవీకి రూ.3.3 కోట్లు వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. హారర్ చిత్రం ఈషాకు రూ.1.6 కోట్లు వచ్చినట్లు టాక్. దండోరా కలెక్షన్లపై వివరాలు తెలియాల్సి ఉంది.