News December 22, 2025

MNCL: లోక్ అదాలత్‌లో 4411 కేసులు పరిష్కారం

image

21న జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో రామగుండం కమిషనరేట్ పరిధిలో మొత్తం 4411 కేసులు పరిష్కరించామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. 59 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ.53,24,105 తిరిగి అందజేసినట్లు పేర్కొన్నారు. టార్గెట్‌కు మించి కేసులు పరిష్కరించబడడం పట్ల కమిషనరేట్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి, మానిటర్ చేసిన అధికారులకు, త్వరలో రివార్డ్స్ అందజేస్తామన్నారు.

Similar News

News December 30, 2025

పల్నాడు: ఇకపై 3 గంటల్లోనే రాజధానుల ప్రయాణం.!

image

హైదరాబాద్‌-అమరావతి మధ్య ప్రయాణ కాలాన్ని తగ్గించేలా నల్లపాడు-బీబీనగర్‌ డబ్లింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా 4 దశల్లో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ లైన్‌ పూర్తయితే ఇరు రాజధానుల మధ్య ప్రయాణ సమయం కేవలం 3 గంటలకు తగ్గనుంది. రైళ్ల వేగం పెరగడంతో పాటు క్రాసింగ్‌ల ఇబ్బందులు తొలగి ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది.

News December 30, 2025

MOIL లిమిటెడ్ 67 పోస్టులకు నోటిఫికేషన్

image

<>MOIL<<>> లిమిటెడ్ 67 గ్రాడ్యుయేట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీ), MSC( జియాలజీ), PG(సోషల్ వర్క్), MBA ఉత్తీర్ణులు అర్హులు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBDలకు ఫీజులేదు. https://www.moil.nic.in

News December 30, 2025

కృష్ణా: అజ్ఞాతంలో వల్లభనేని వంశీ

image

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. 2024 జూన్ 7న సునీల్‌పై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 17న మాచవరం పోలీసులు వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి వంశీ కనిపించకపోవడంతో, అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మొన్నటి వరకు నియోజకవర్గంలో ఆక్టివ్‌గా ఉన్న వంశీ సడన్‌గా అదృశ్యమయ్యారు.