News December 22, 2025
అంబాజీపేట: 1729 ఆకృతిలో ఆకట్టుకున్న విద్యార్థులు

దేశానికి గణిత మేధావిగా శ్రీనివాస రామానుజన్ ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సాధించారని అంబాజీపేట మండలం కె.పెదపూడి జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం వేణుగోపాలకృష్ణ చెప్పారు. జాతీయ గణిత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్‌కు ఎంతో ఇష్టమైన సంఖ్య 1729 అని, దీనిని 2 ఘనముల మొత్తంగా వ్రాయగల చిన్న సంఖ్య కావటంతో దీనిని ‘రామానుజన్ సంఖ్య’ అంటారన్నారు. 1729 అంకెల నమూనాతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.
Similar News
News December 26, 2025
అమ్మ సెంటిమెంట్.. మోసపోయిన మ్యూజిక్ డైరెక్టర్

సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను సైతం వదలట్లేదు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాశ్‌ను ఓ వ్యక్తి SMలో సాయం కోరాడు. ఓ ఫొటోను షేర్ చేసి.. అమ్మ చనిపోయిందని అంత్యక్రియలకు డబ్బుల్లేవని తెలిపాడు. దీంతో చలించిపోయిన జీవీ ప్రకాశ్.. రూ.20,000 పంపించారు. అయితే ఆ ఫొటో 2022 నాటిదని, తాను మోసపోయానని తర్వాత గుర్తించారు. అమ్మ పేరుతో మోసం చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సాయం చేసిన GVని ప్రశంసిస్తున్నారు.
News December 26, 2025
ఆస్ట్రేలియా దెబ్బ.. కుప్పకూలిన ఇంగ్లండ్

ASHES SERIES: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ ఫస్ట్ డేనే రెండు జట్లు కుప్పకూలాయి. తొలుత ఆస్ట్రేలియా 152 పరుగులకే ఆలౌట్ కాగా ఇంగ్లండ్ అంతకంటే ఘోరంగా 110 రన్స్‌కే చాప చుట్టేసింది. హ్యారీ బ్రూక్ (41), స్టోక్స్ (16), అట్కిన్సన్ (28) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు.
News December 26, 2025
మంచిర్యాల: మున్సిపల్ పోరుకు కాంగ్రెస్ సమాయత్తం

రానున్న మున్సిపాలిటీ ఎన్నికల కోసం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేస్తున్నారు. పట్టణాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, రెబల్స్ బెడద లేకుండా అభ్యర్థుల గెలుపునకు ఏకతాటిపైకి తెస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు.


