News April 22, 2024

పండువెన్నెల్లో నేడు ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం

image

AP: కడప జిల్లా ఒంటిమిట్టలో నేడు సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. సాధారణంగా అన్ని ఆలయాల్లో శ్రీరామ నవమి రోజున కళ్యాణం జరుపుతారు. ఇక్కడ మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున పండువెన్నెల్లో స్వామివార్ల పెళ్లి వేడుక నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ ఉత్సవానికి సీఎం జగన్ బదులు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Similar News

News October 15, 2024

‘దేవర’ విజయం: లేఖ రాసిన ఎన్టీఆర్

image

దేవర సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ ఈరోజు ఓ లేఖ విడుదల చేశారు. ‘దేవర సినిమాకు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మీరు అందిస్తున్న ఆదరణకు థాంక్స్. నా సహనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు అందరికీ ధన్యవాదాలు. నెల రోజులుగా దేవరను ఓ పండుగలా జరుపుకొంటున్న నా ఫ్యాన్స్‌కు శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎప్పటికీ మీరు గర్వపడే సినిమాలే చేయడానికి ప్రయత్నిస్తాను’ అని పేర్కొన్నారు.

News October 15, 2024

WTC: కోహ్లీ రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తారా?

image

WTC చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా కోహ్లీ పేరిట రికార్డు ఉంది. WTCలో ఆయన 22 టెస్టులకు కెప్టెన్సీ చేయగా 14 మ్యాచుల్లో గెలిచి, ఏడింట్లో ఓడారు. ఒకటి డ్రాగా ముగిసింది. రోహిత్ శర్మ ఇప్పటివరకూ 18 మ్యాచుల్లో కెప్టెన్‌గా ఉన్నారు. ఇందులో 12 విజయాలు, 4 అపజయాలు, రెండు డ్రా మ్యాచులు ఉన్నాయి. NZతో జరిగే 3 మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను 3-0తో గెలిస్తే కోహ్లీ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేస్తారు.

News October 15, 2024

2019లో మహారాష్ట్రలో ఏం జరిగింది? (1/2)

image

2019 Octలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో BJP- అప్ప‌టి ఉద్ధ‌వ్ నేతృత్వంలోని శివ‌సేన కూట‌మి 161 స్థానాలు గెలుచుకుంది. BJP105, శివ‌సేన 56 సీట్లు ద‌క్కించుకున్నాయి. అయితే, ఫ‌లితాల త‌రువాత త‌మ‌కూ CM ప‌ద‌వి ఇవ్వాల‌ని శివ‌సేన మెలిక పెట్టింది. దీనికి BJP అంగీక‌రించ‌లేదు. దీంతో కాంగ్రెస్ (44), ఎన్సీపీ (54)ల మ‌ద్ద‌తుతో ఉద్ధ‌వ్ ఠాక్రే CM అయ్యారు. త‌ద్వారా మ‌హారాష్ట్రలో మ‌హావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్ప‌డింది.