News December 22, 2025

గడువులోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్

image

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తహశీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని రెండు.నియోజకవర్గాల పురోగతిని గణాంకాల ఆధారంగా సమీక్షించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫొటోలు వంటి లోపాలను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

Similar News

News January 12, 2026

తూ.గో: అన్నను రోకలిబండతో కొట్టి చంపిన తమ్ముడు

image

కుటుంబ కలహాలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నిడదవోలు(M) అట్లపాడులో బండి కోట సత్యనారాయణ(28) అనే యువకుడు తన తమ్ముడు సాయిరాం చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో సాయిరాం రోకలిబండతో అన్న తలపై బలంగా కొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి దుర్గ భవాని ఉన్నారు. సమిశ్రగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

News January 12, 2026

పల్నాడు: తిరుణాళ్లలో విషాదం.. నిద్రలో ఉన్న వ్యక్తిపై నుంచి వెళ్లిన వాహనం!

image

దుర్గి (M) ధర్మవరం తాతయ్య తిరుణాల వేడుకల్లో ఘోర ప్రమాదం జరిగింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పాటకచేరిని చూసేందుకు ప్రకాశం (D) కుమ్మరపల్లి నుంచి వచ్చిన బ్రహ్మయ్య (45), కార్యక్రమం అనంతరం అక్కడే నిద్రిస్తుండగా గుర్తుతెలియని వాహనం అతడిపై నుంచి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన బ్రహ్మయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 12, 2026

సీబీఐ విచారణకు విజయ్

image

కరూర్ తొక్కిసలాట కేసులో హీరో, టీవీకే చీఫ్ విజయ్ దళపతి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌లో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.