News December 22, 2025
నేరాల నియంత్రణలో రాచకొండ పోలీసులు సక్సెస్: సీపీ

విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్, టెక్నాలజీ సమన్వయంతో అమలు చేసిన VQT వ్యూహం నేరాల నియంత్రణలో ఫలితాలిచ్చిందని సీపీ సుధీర్ బాబు అన్నారు. అన్యువల్ ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 6,188 నివారణ అరెస్టులు చేపట్టగా, నమోదైన కేసుల్లో 78 శాతం పరిష్కార రేటు సాధించామన్నారు. మహిళలు, బలహీన వర్గాల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
Similar News
News December 29, 2025
కమిషనరేట్ పరిధిలో 77 గేమింగ్ యాక్ట్ కేసులు నమోదు: సిద్దిపేట సీపీ

సిద్దిపేట జిల్లా అంతటా మద్యం అమ్మే అక్రమ బెల్టు షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ జరుగుతోందని సీపీ విజయ్ కుమార్ తెలిపారు.ప్రజల భద్రత, గ్రామాల్లో శాంతిభద్రతల నిర్వహణ దృష్ట్యా మద్యం అక్రమ అమ్మకాలను నిషేధించడానికి ప్రజలు సహకరించాలన్నారు. 77 గేమింగ్ యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.11,25,700 స్వాధీనం చేసుకున్నామన్నారు. 440 ఎక్సైజ్ యాక్ట్ కేసులు, 203 అక్రమ ఇసుక రవాణా కేసులు నమోదు చేశామన్నారు.
News December 29, 2025
ట్రాఫిక్ వాయిలేషన్‌లో రూ.16,73,29,000 పెనాల్టీ: సిద్దిపేట సీపీ

సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ 2025వ సంవత్సర వార్షిక నివేదిక సోమవారం రిలీజ్ చేశారు. గత సంవత్సరం ట్రాఫిక్‌కి సంబంధించి అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. ట్రాఫిక్ వాయిలేషన్‌కి పాల్పడిన వారి నుంచి రూ.16,73,29,000 పెనాల్టీ రూపంలో వసూలు చేసినట్టు వార్షిక నివేదికలో తెలిపారు. రోడ్డు భద్రత లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని సీపీ విజయ్ కుమార్ తెలిపారు.
News December 29, 2025
పిశాచ స్థానం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా?

ఇంటి ప్రధాన గోడకు, ప్రహరీ గోడకు మధ్య ఉండే ఖాళీ స్థలాన్ని ‘పిశాచ స్థానం’ అంటారు. ఈ స్థలం విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు హెచ్చరిస్తున్నారు. ‘ప్రకృతి వనరుల సమతుల్యత దెబ్బతినడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఇంటి నిర్మాణంలో ఈ ఖాళీ స్థలాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


