News December 22, 2025
డ్వాక్రా మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను సందర్శించారు. మహిళలకు అందుబాటులో ఉన్న వనరులపై రూపొందించిన ప్రచార సామగ్రి, ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. పారిశ్రామిక యూనిట్ల స్థాపన, విజయవంతంగా నడిపించడంపై దృష్టి సారించాలని సూచించారు.
Similar News
News December 25, 2025
బాబువన్నీ చిల్లర రాజకీయాలే: కాకాణి

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు కోటి సంతకాలు చేసినా CM లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని YCP నేత కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. ‘పేదలకు మేలు చేసేలా జగన్ వైద్యరంగాన్ని అభివృద్ధి చేశారు. వాటిని నీరుగార్చి ప్రైవేటుతో మేలుచేస్తానంటే ఎవరూ నమ్మరు. ఎన్నికకో పార్టీతో పొత్తు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తూ నావి హుందా పాలిటిక్స్ అని CBN అనడం హాస్యాస్పదం’ అని ఎద్దేవా చేశారు.
News December 25, 2025
పిట్ ఎన్డీపీఎస్ చట్టం ఎప్పుడు ప్రయోగిస్తారంటే?

➤గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలను ముందస్తుగా అడ్డుకోవడానికి తీసుకొచ్చిన కఠిన చట్టం.
➤నిందితుడిని కోర్టు విచారణ లేకుండానే ముందస్తు నిర్బంధం చేయవచ్చు.
➤సమాజానికి ప్రమాదంగా మారిన వారిపై మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు.
➤గరిష్ఠంగా ఏడాది వరకు జైలులో నిర్బంధం చేయవచ్చు.
➤శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు ముప్పు ఉంటే ప్రభుత్వం ఈ చట్టం అమలు చేస్తుంది.
News December 25, 2025
రుద్రవరం: గుండెపోటుతో సర్పంచ్ మృతి

రుద్రవరం మండలం మందలూరు గ్రామ సర్పంచ్ సగిలి శ్రీనివాస్ రెడ్డి గురువారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి మృతుడి స్వగృహం చేరుకొని సగిలి శ్రీనివాస్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.


