News December 22, 2025
నర్వ ఆస్పిరేషన్ బ్లాక్‌పై సెంట్రల్ ప్రభారీ అధికారి సమీక్ష

నర్వ మండల ఆస్పిరేషన్ బ్లాక్ ప్రాజెక్ట్ ప్రగతిపై సోమవారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి సెంట్రల్ ప్రభారి అధికారిణి స్వప్న దేవి రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహారం, విద్యా, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి సూచీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 27, 2025
పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడానికి కారణాలు

చలిని తట్టుకోవడానికి పశువులకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అలాగే ఈ సమయంలో జీవాల్లో జీర్ణప్రక్రియ మందగించడం వల్ల అవి సరిగా గడ్డి, దాణా తీసుకోవు. ఫలితంగా వాటికి కావాల్సిన పోషకాలు అందవు. చలికాలంలో పచ్చిగడ్డి లభ్యత కూడా తగ్గుతుంది. పశువుల్లో ఒత్తిడి (కోల్డ్ స్ట్రెస్) కారణంగా అవి ఆహారం సరిగా తీసుకోవడానికి ఇష్టపడవు. పొదుగువాపు, జ్వరం, నిమోనియా వంటి వ్యాధుల ముప్పు పశువుల పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి.
News December 27, 2025
కేరళ రాజధానిలో కాషాయ జెండా

కేరళలో కాషాయ దళం సరికొత్త అధ్యాయం లిఖించింది. నాలుగు దశాబ్దాలుగా LDF ఆధిపత్యంలో ఉన్న <<18552178>>తిరువనంతపురం<<>> మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుని తొలిసారి మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది. BJP రాష్ట్ర కార్యదర్శి, కొడుంగనూర్ కౌన్సిలర్ V.V.రాజేశ్ 51 ఓట్లతో మేయర్‌గా ఎన్నికయ్యారు. LDFకి 29, UDFకి 19 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విజయం కేరళ రాజకీయ సమీకరణాలను మార్చే కీలక మలుపుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
News December 27, 2025
ప్రకాశం: చాక్లెట్లు ఇస్తానని ఇద్దరు చిన్నారులపై అత్యాచారం

ఇద్దరు చిన్నాలకు తినుబండారాలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడిన ఘటన వైపాలెం (M)నర్సాయపాలెంలో జరిగినట్లు SI చౌడయ్య తెలిపారు. ఆంజనేయులు గ్రామంలో చిల్లర కొట్టు నడిపేవాడు. క్రిస్మస్ రోజు బాలికలకు(10,11) చాక్లెట్ల ఆశ చూపి ఓ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం, తర్వాత మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.


