News December 22, 2025

NLG: ప్రజావాణికి 53 దరఖాస్తులు

image

నల్గొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. వివిధ సమస్యలపై 53 మంది అర్జీలు సమర్పించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 26, తక్కిన 27 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయి. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Similar News

News December 27, 2025

జిల్లాలో 4.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

image

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు దగ్గర పడ్డాయి. ఇప్పటివరకు 4.86 లక్షల మెట్రిక్ పనుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 392 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 85,175 మంది రైతుల నుంచి రూ.1158 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో రైతులకు ఇప్పటివరకు రూ.1078 కోట్లు చెల్లించారు. సాగర్, దేవరకొండ నియోజకవర్గాలలో కొన్నిచోట్ల ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.

News December 27, 2025

నల్గొండ జిల్లాలో ముమ్మరంగా నట్టల నివారణ కార్యక్రమం

image

నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 78 బృందాలుగా ఏర్పడిన 250 మంది సిబ్బంది గ్రామగ్రామాన జీవాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం31వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60 శాతం లక్ష్యం పూర్తయిందని, గొర్రె కాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారులు సూచించారు.

News December 26, 2025

నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి: జాజుల

image

నల్గొండ జిల్లాలో బీసీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం కల్పించాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని, నామినేటెడ్ పదవుల ద్వారా భర్తీ చేసి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.