News December 22, 2025

లోక్ అదాలత్‌లో 3,884 కేసుల పరిష్కారం: సూర్యాపేట ఎస్పీ

image

జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,884 కేసులు పరిష్కారమైనట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఇందులో 446 క్రిమినల్, 1,582 ఈ-పెట్టీ, 1,856 ఎంవీ యాక్ట్ కేసులు ఉన్నాయి. అలాగే 33 సైబర్ కేసుల్లో రూ.11.50 లక్షలను బాధితులకు రీఫండ్ చేయించారు. పోలీస్, న్యాయశాఖల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని, ముందస్తు ప్రణాళికతో పెండింగ్ కేసులను తగ్గించగలిగామని ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News January 17, 2026

ఎయిర్ ‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>ఎయిర్ ‌పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్ కంపెనీ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, ICWA అర్హతతో పాటు పని అనుభవం గల వారు FEB 15వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.60K, మేనేజర్ పోస్టుకు రూ.70K చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.aai.aero

News January 17, 2026

ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జనవరి 19 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశుపోషకులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

News January 17, 2026

మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

image

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.