News December 22, 2025

వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట: ఆనం

image

ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పది రోజుల్లోని 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు (సుమారు 90 శాతం) వారికే కేటాయించారు. ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశిత సమయాల్లోనే తిరుమలకు రావాలని సూచించారు. AI టెక్నాలజీతో క్యూలైన్ల పర్యవేక్షణ, విస్తృత అన్నప్రసాదాలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News December 26, 2025

HYDలో తొలిసారిగా రిమోట్ కంట్రోల్డ్ రూఫ్!

image

పాతబస్తీలోని అలావా-ఏ-బీబీ వద్ద దేశంలోనే అరుదైన, సిటీలో మొట్టమొదటి ‘రిమోట్ కంట్రోల్డ్ రిట్రాక్టబుల్ రూఫ్’ రాబోతోంది. సుమారు రూ.1.20 కోట్లతో GHMC ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. మొహర్రం వేడుకలప్పుడు ఎండ, వానల వల్ల భక్తులు పడే ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది. ఒకే ఒక్క రిమోట్ బటన్‌తో 4,844 చదరపు అడుగుల భారీ పైకప్పు క్షణాల్లో తెరుచుకుంటుంది లేదా మూసుకుంటుంది. సిటీలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి.

News December 26, 2025

పిల్లలే దేశ భవిష్యత్‌కు పునాది: VZM కలెక్టర్

image

వీర్ బాల్ దివస్ వేడుకలు విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణితో కలిసి జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వీర్ బాల్ దివస్‌కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాది అని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 26, 2025

పేదల పక్షాన శతాబ్ది పోరాటం: ఎమ్మెల్సీ సత్యం

image

భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా సీపీఐ సాగించిన పోరాటాలు అద్వితీయమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మగ్దూమ్ భవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. 1925లో కాన్పూర్‌లో ఆవిర్భవించిన నాటి నుంచి రైతు, కూలీ, అణగారిన వర్గాల హక్కుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.