News December 22, 2025

పోలీసు వృత్తి సేవా భావంతో కూడుకున్నది: SP

image

కాకినాడల్ APSP 3వ బెటాలియన్‌లో 2025-26 బ్యాచ్‌ కానిస్టేబుళ్ల తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా SP బిందు మాధవ్ శిక్షణను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో చేరడం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల సేవకు అంకితమయ్యే బాధ్యతాయుతమైన వృత్తి అని పేర్కొన్నారు.

Similar News

News January 6, 2026

‘ఆరోగ్య పాఠశాల’ అమలుపై కలెక్టర్ సమీక్ష

image

విద్యార్థుల శారీరక, మానసిక వికాసమే ప్రధాన లక్ష్యంగా జిల్లాలో ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఆరోగ్య పాఠశాలపై సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడమే ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.

News January 6, 2026

నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలి: కలెక్టర్

image

నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్‌లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీల్లో నిర్మల్ ఉత్సవాలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News January 6, 2026

డీసీసీబీని అభివృద్ధి పథంలో నడిపించాలి: కలెక్టర్

image

జిల్లా సహకార పరపతి బ్యాంకు (డీసీసీబీ) కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె బ్యాంకును సందర్శించి, వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. రికవరీల శాతం పెంచాలని, డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం బ్యాంకు క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్, సిబ్బంది అంకితభావంతో పనిచేసి బ్యాంకును బలోపేతం చేయాలని కోరారు.