News December 22, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

ఆమదాలవలస: అభివృద్ధికి విద్యుత్ రంగం కీలకం: ఎమ్మెల్యే కూన
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్ కు 37 అర్జీలు
కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదుదారుల తాకిడి
బాల్య వివాహాలను అరికట్టాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: ఎమ్మెల్యే మామిడి
నందిగం: జాతీయ రహదారిపై తప్పిన పెనుప్రమాదం
పోలాకి: విద్యుత్ స్థంబాన్ని ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు.
Similar News
News December 28, 2025
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీలు పెరగనున్నాయా?

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ప్రస్తుతం 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన, పాలనా సౌలభ్యంకోసం ప్రజలనుంచి వినతలు వచ్చాయి. ఈ మేరకు 52 కొత్త పంచాయితీల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి భారతి, సౌజన్య చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుమతుల తర్వాత పంచాయతీ విభజన సాధ్యమవుతుందన్నారు.
News December 28, 2025
SKLM: ‘విధుల్లో మరింత ప్రగతి సాధించాలి’

పోలీస్ అధికారులు విధుల్లో మరింత ప్రగతి సాధించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో ముఖ్యమైన కేసులు, ప్రాపర్టీ నేరాల చేదన, ముద్దాయిల అరెస్టు, నిందితులకు శిక్షలుపడే విధంగా చేసిన కృషి, లోక్ అదాలత్ కేసులు పరిష్కారం వంటి అంశాల్లో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన అధికారులనకు సర్టిఫికెట్లు ఇచ్చి అభినందించారు.
News December 28, 2025
శ్రీకాకుళం జిల్లాలో మాంసం ధరలు ఇలా.!

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. చికెన్ లైవ్ రూ.165 కాగా, స్కిన్ చికెన్ రూ.285, స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.305గా ప్రాంతాన్ని బట్టి నమోదైంది. దీంతో ఆదివారం మాంసాహార ప్రియులకు నిరాశ ఎదురైంది. వారం రోజుల వ్యవధిలో చికెన్ ధరలు సుమారు రూ.40 పెరగడంతో చర్చనీయాంశంగా మారింది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


