News December 22, 2025

ములుగు: ప్రజావాణిలో 35 వినతుల స్వీకరణ

image

ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. అదనపు కలెక్టర్లు సిహెచ్.మహేందర్, సంపత్ రావు జీ ప్రజల నుంచి వినతి స్వీకరించారు. మొత్తం 35 వినతులు వచ్చాయి. వీటిలో 8 భూ సమస్యలు, 4 గృహ నిర్మాణం, పెన్షన్‌కు సంబంధించి 6, ఇతర సమస్యలకు సంబంధించిన 17 వినతులు ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.

Similar News

News December 29, 2025

వారం రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు: SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ దామోదర్ ప్రజల నుంచి 19 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో భూ వివాదాలు 8, కుటుంబ కలహాలు 3, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలపై 7 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వాస్తవాలను పరిశీలించి, 7 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News December 29, 2025

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: ములుగు కలెక్టర్

image

ములుగు జిల్లా రైతులు యూరియా కోసం ఆందోళన పడవద్దని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ దివాకర్ తెలిపారు. ఈ సీజన్లో 17,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా.. ప్రస్తుతం 972 మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించినట్లు తెలిపారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 9945 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామని వెల్లడించారు. అవసరమైనన్ని కాంప్లెక్స్ ఎరువులను కూడా తెప్పించామని స్పష్టం చేశారు.

News December 29, 2025

అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి: ఎస్పీ

image

ప్రజల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన 22 మంది బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.